Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇల్లందులో పేరుకుపోయిన చెత్త చెదారం.పట్టించుకొని మున్సిపాలిటీ.

Author
Posted By Dasyam.surendrababu
| 25 Oct 2026, 01:16 PM | భద్రాద్రి కొత్తగూడెం
ఇల్లందులో పేరుకుపోయిన చెత్త చెదారం.పట్టించుకొని మున్సిపాలిటీ.

ఇల్లందు ప్రతినిధి :-

ఇల్లందులో మున్సిపల్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన దసరా పండగ వారోత్సవాల అనంతరం పట్టణంలోని పలు వార్డులలో పేరుకుపోయిన చెత్తాచెదారమును మునిసిపల్ సిబ్బంది తీయడం లేదని దీంతో పలు వార్డులలో దుర్గంధం పేరుకపోయిందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని పలు అంతర్గత రహదారులలో పిచ్చి చెట్లను తీసివేస్తూ క్లీనింగ్అండ్ గ్రీన్ బాధ్యతను మర్చిపోకుండా మున్సిపల్ పాలకవర్గం చర్యలు చేపట్టాలని పట్టణ మేధావులు పేర్కొంటున్నారు.


  • ఇల్లందు ప్రధాన దారులలో డివైడర్లను ఏర్పాటు చేయాలి

ఇల్లందు పట్టణ ప్రధాన రహదారులలో డివైడర్లను గతమున్సిపల్ పాలకవర్గం ప్రస్తుత పాలకవర్గం కూడా ఏర్పాటు చేయకపోవడం మూలంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సిటిజనులు పేర్కొంటున్నారు. పట్టణంలోని డీఎస్పీ ఆఫీసు నుండి కరెంట్ ఆఫీస్ వరకు కుడి ఎడమల అంతర్గత రహదారులను కలుపుకుపోయే మార్గాలలో డివైడర్లు లేకపోవడం మూలంగా ప్రమాదాలు దగ్గరకు వచ్చి సెకండ్ లలో తప్పిపోతున్న పరిస్థితి నెలకొని ఉంది. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న పట్టణంలోని పలు వీధుల అంతర్గత రహదారుల నుండి వచ్చే వాహనదారులు ప్రధాన రహదారుల నుండి స్పీడుగా వెళ్లే వాహన చోదకులు అనేకసార్లు ప్రమాదాలు జరిగే పరిస్థితి నెలకొని ఉండటం మూలంగా ప్రాణాలను అరిచేతులో పెట్టుకొని ప్రయాణించవలసి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. అంతర్గత రహదారుల నుండి ప్రధాన రహదారికి అనుకునే వీధుల కౌన్సిలర్లు వెంటనే డివైడర్ను ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ చైర్మన్ తోనూ మాట్లాడి ప్రమాదాలు జరగకముందే ప్రాణాలు పోకముందే, డివైడర్లను ఏర్పాటు చేయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: