Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దండు సారయ్య ఆధ్వర్యంలో ఘనంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ వేడుకలు.

Author
Posted By PRAJA NIJAM NEWS
| 18 Oct 2026, 10:00 PM | భద్రాద్రి కొత్తగూడెం
దండు సారయ్య ఆధ్వర్యంలో ఘనంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ వేడుకలు.

  • తొమ్మిది రోజులపాటు 13వ వార్డు ఆర్ అండ్ ఆర్ కాలనీలో దేవతామూర్తుల పూజలు నిర్వహించిన దండు సారయ్య.

ఇల్లందు మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులోని సమ్మక్క సారక్క ఆలయ దేవతల ఉపాసకుడు, మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు తొమ్మిది దేవత అవతారాలను ప్రముఖ పూజారులతో పూజింప చేస్తూ ఆదివారం 13వ వార్డు ప్రధాన రహదారిలో అంగరంగ వైభవంగా ఘనంగా వందలాది మహిళలచే బతుకమ్మ పండగను కోలాహలం మధ్య బతుకమ్మ పండగ దేవతల భక్తి పాటల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా దండు సారయ్య మాట్లాడుతూ
తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ఐక్యతకు ప్రకృతితో ముడిపడిన జీవన విధానానికి సద్దుల బతుకమ్మ ఒక అద్భుతమైన ప్రతీక అని ఆదివారం నిర్వహించే సద్దుల బతుకమ్మ 9 రోజుల పాటు దేవతామూర్తుల పూజలతోసాగే పూల పండగకు ఇది ఘనమైన ముగింపు వేడుక అని 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య పేర్కొన్నారు. జగన్మాత అయిన దుర్గాదేవిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించామని మొదటి రూపం శ్రీ స్వర్ణ కవచలం కృత దుర్గాదేవి గా రెండవ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా మూడోరోజు శ్రీ గాయత్రీ దేవి అలంకరణతో నాలుగో రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణతో ఐదవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవిగా ఏడో రోజు శ్రీ సరస్వతి దేవిగా ఎనిమిదో రోజు శ్రీ దుర్గాదేవిగా తొమ్మిదవ రోజు మహిషాసురుని మర్దన చేసిన జగన్మాత దేవిగా పూజించి చివరి రోజున వందలాదిగా హాజరైన మహిళలచే బతుకమ్మ పండుగను కోలాహలం మధ్య మిరిమిట్లు గోల్పే విద్యుత్ కాంతుల మధ్య బతుకమ్మ భక్తి పాటల మధ్య అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. లోక కంటకుడైన మహిషాసురుడిని సహరించిన విజయ స్వరూపం గా భావించే జగన్మాతను పూజిస్తే సకల విజయాలు సిద్ధిస్తాయని దండు సారయ్య తెలిపారు. పదవ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంతో అమ్మవారు దర్శనమిచ్చి విజయదశమి వేడుకలతో నవరాత్రులు ముగుస్తాయని దండు సారయ్య తెలిపారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: