దండు సారయ్య ఆధ్వర్యంలో ఘనంగా అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ వేడుకలు.
ముఖ్యమైన పాయింట్స్:తొమ్మిది రోజులపాటు 13వ వార్డు ఆర్ అండ్ ఆర్ కాలనీలో దేవతామూర్తుల పూజలు నిర్వహించిన దండు సారయ్య. ఇల్లందు మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులోని సమ్మక్క సారక్క ఆలయ దేవతల ఉపాసకుడు, మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు తొమ్మిది దేవత అవతారాలను ప్రముఖ పూజారులతో పూజింప చేస్తూ ఆదివారం 13వ వార్డు ప్రధాన రహదారిలో అంగరంగ వైభవంగా ఘనంగా వందలాది మహిళలచే బతుకమ్మ పండగను కోలాహలం మధ్య బతుకమ్మ పండగ దేవతల భక్తి పాటల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా దండు సారయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ఐక్యతకు ప్రకృతితో ముడిపడిన జీవన విధానానికి...