పట్టణంలోని కళాసిబస్తి 16వ వార్డు లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు ఇల్లందు పట్టణంలోని 16వ వార్డు లో ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు.16 వార్డుకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. పండుగను పురస్కరించుకొని ప్రత్యేక లైటింగ్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా పండుగ శోభను సంతరించుకుంది. బతుకమ్మ పాటలతో మార్మోగగా, మహిళలు ఉత్సాహంగా బతుకమ్మల చుట్టూ చేరి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతిని ఆరాధించే సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు. వార్డులోని...