దసరా ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు మొండిచేయి.!
ముఖ్యమైన పాయింట్స్:స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వాలని దండు సారయ్య విజ్ఞప్తి. ఇల్లందు శాసనసభ్యులు ఏ పార్టీ వారైనప్పటికీ, మున్సిపాలిటీలొ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించే దసరా మహోత్సవంలో నిర్వహించే స్థానిక కళాకారులకు అవకాశం ఇచ్చేవారని అనేక ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయానికి విరామమెందుకని ? స్థానిక ప్రతిభను విస్మరించడం సరికాదని నృత్య కళాకారుల తరఫున స్థానిక మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లందు పట్టణంలో ఆనవాయితీగా దశాబ్దాలుగా దసరా ఉత్సవాల్లో భాగంగా స్థానిక నృత్య కళాకారులు ప్రదర్శనలు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తున్నప్పటికీ, ఈసారి వారికి అవకాశం కల్పించకపోవడంపై 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య...