నేడే ఇల్లందులపాడు కాళీమాత కాలనీలో ఈ నెల 18న ఘనంగా బతుకమ్మ పోటీలు
ముఖ్యమైన పాయింట్స్:విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని, రెండో వార్డు ఇల్లందులపాడు కాళీమాత ఆలయం ఎదుట, ఈ నెల 18వ తేదీన ఆదివారం బతుకమ్మ పండుగ సందర్భంగా ఘనంగా బతుకమ్మ పోటీలు, సంబరాలు నిర్వహించనున్నారు. స్థానిక యువత, పెద్దల ఆధ్వర్యంలో, ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇల్లందు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ కోరం కనకయ్య సహకారంతో, ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ నాయకత్వంలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. బతుకమ్మ పోటీల్లో విజేతలకు ప్రత్యేక బహుమతులు ఉన్నాయన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నారు. మొదటి బహుమతి: డ్రెస్సింగ్...