🏠 prajanijam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 18 October 2026, 10:49 pm Posted by : PRAJA NIJAM NEWS

పట్టణంలోని కళాసిబస్తి 16వ వార్డు లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.

News Image
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు ఇల్లందు పట్టణంలోని 16వ వార్డు లో ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు.16 వార్డుకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు.
పండుగను పురస్కరించుకొని ప్రత్యేక లైటింగ్, సౌండ్ సిస్టం ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా పండుగ శోభను సంతరించుకుంది. బతుకమ్మ పాటలతో మార్మోగగా, మహిళలు ఉత్సాహంగా బతుకమ్మల చుట్టూ చేరి సంబరాలు జరుపుకున్నారు.
తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతిని ఆరాధించే సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చారు.
వార్డులోని మహిళలందరూ ఒకచోట చేరి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, వార్డులో పండుగలు, సంప్రదాయ వేడుకలను ఘనంగా నిర్వహించడం ద్వారా ప్రజల మధ్య ఐకమత్యం, ఆత్మీయత మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగను ప్రతి ఏటా మరింత వైభవంగా నిర్వహిస్తూ, మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతామని దేవరపల్లి రజిత, బైరెడ్డి శోభారాణి, పడాల ప్రమీల, పడాల కల్పన, పరిష స్రవంతి మరియు 16 వ వార్డు వాసులు పేర్కొన్నారు.
🏠 Home