🏠 prajanijam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 18 October 2026, 9:58 pm Posted by : PRAJA NIJAM NEWS

గ్రాడ్యేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బయ్యారం మండలం కాంగ్రెస్ శ్రేణులతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమావేశం.

News Image
ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సన్నాక సమావేశాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జూలకంటి సీతారామరెడ్డి అధ్యక్షతన ఆదివారం ఖమ్మం వరంగల్ నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల పార్టీ బాధ్యుల క్రియాశీలక కార్యకర్తల అభిమానుల సన్నహుక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ముందుగా
ప్రజా వైధ్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహయ నిధి పేరిట ఇచ్చే చెక్కులు ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా లభ్ధిధారులకు అందచేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ
ప్రజా ప్రభుత్వం పేదలకు అందిచే సంక్షేమ పధకాలే కాంగ్రెస్ పార్టీ కి శ్రీ రామ రక్ష అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు.
యువత మొత్తం బిజేపి ప్రభుత్వం చేసే నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తున్నారని,కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ని ప్రధాని చేయాలని యువత ప్రజలు పరితపిస్తున్నారని కోరం కనకయ్య అన్నారు.
తెలంగాణ యువతకు 70 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, ప్రజా ప్రభుత్వానిదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ బాధ్యులు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తలు అభిమానులు తమ మండలంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ ని
గ్రాడ్యేట్ పూర్తి అయిన ప్రతి ఒక్కరి ఓట్లను నవంబర్ 6 వ తేదీలోగా నమోదు చేయించాలని, గతంలో ఓటు వేసిన వారివికూడ రెన్యూవల్ చేయించాలన్నారు.
మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సర్వోత్తం రెడ్డి కుటుంబం తరతరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని పార్టీ కుటుంబ సభ్యులను ఆదుకున్నారని అటువంటి కుటుంబం నుండి వచ్చిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన సర్వోత్తమ రెడ్డిని గెలుపించాల్సిన భాధ్యత కాంగ్రెస్పార్టీ శ్రేణులపై ఉన్నదన్నారు.
బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాట్లాడుతున్నారని, ప్రపంచం మొత్తం ఎలినినో సమస్యతో పోరాడుతున్న తరుణంలో బిఆర్ఎస్ పార్టీ వ్యాఖ్యలు నిసిగ్గుగా ఉన్నాయన్నారు. ఎలినినో ప్రభావం వలన వర్షాలు తగిన మోతాదులో పడే అవకాశం దేశంలో లేనందున ప్రజలంతా నీటిని,విధ్యుత్ను పొదుపుగా వాడాలన్నారు.
బయ్యారం మండలంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందించిన పథకాలను ప్రతి గడపకు తెలియచేయాలన్నారు. ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే సర్వోత్తమ్ రెడ్డి ని గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన ప్రతి కార్యకర్త నాయకులు ప్రజాప్రతినిధులు పార్టీ బాధ్యులు మహిళా సంఘం అన్ని వర్గాల నాయకురాళ్లు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య వెంట
ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు,
బయ్యారం మాజీ సొసైటి చైర్మెన్, జిల్లా కాంగ్రెస్ కమిటి కార్యదర్శి మూల మధుకర్ రెడ్డి,
ఇల్లందు మార్కెట్ కమిటి వైస్ చైర్మెన్ బిజ్జా వెంకటేశ్వర్లు,బయ్యారం సర్పంచ్ శాంతి కిషన్,కొత్తపేట గంధం పల్లి సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్,జగ్గుతండా సర్పంచ్ లలిత,కోయగూడెం సర్పంచ్ లింగ నాయక్, కస్తూరి నగరం సర్పంచ్ రవి నాయక్, బాలాజీ పేట సర్పంచ్ మాలూత్ పార్వతి శ్రీనివాస్, జగద్రావుపేట సర్పంచ్ మోహన్ జి, ఇస్లాపురం సర్పంచ్ ఎట్టి సరోజిని, ఉప్పలపాడు సర్పంచ్ పానుగోతు వెంకన్న, నర్సితండ సర్పంచ్ సేవాలాల్,చర్లపల్లి సర్పంచ్ బాలకృష్ణ, రామచంద్రపురం సర్పంచ్ వనిత మంగీలాల్, మొట్ల తిమ్మాపురం సర్పంచ్ సాంబశివ, తెల్లం బిక్షం, చాదర్లమూడి భాస్కర్, తిరుమల ప్రభాకర్ రెడ్డి, తమ్మిశెట్టి వెంకటపతి, రామచంద్రపురం ఉపసర్పంచ్ తొట్టి కృష్ణ, సింగారం రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home