ఘనంగా జరుపుకున్న సద్దుల బతుకమ్మ
కొత్తగూడెం, అక్టోబర్ 18, తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకుంటున్న సద్దుల బతుకమ్మ కొత్తగూడెంలోని డాక్టర్ జి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా నిలిచే బతుకమ్మ పండగ తెలుగింటి ఆడబిడ్డలు పట్టు వస్త్రాలు ధరించి వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మల తో బతుకమ్మ పాటలు పాడుతూ రంగ రంగ వైభవంగా ఈ వేడుక జరుపుకున్నారు ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు పాల్గొని వారికి బహుమతులు ప్రధానం చేశారు,