దసరా ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు మొండిచేయి.!
ముఖ్యమైన పాయింట్స్:స్థానిక కళాకారులకు అవకాశం ఇవ్వాలని దండు సారయ్య విజ్ఞప్తి.
ఇల్లందు శాసనసభ్యులు ఏ పార్టీ వారైనప్పటికీ, మున్సిపాలిటీలొ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించే దసరా మహోత్సవంలో నిర్వహించే స్థానిక కళాకారులకు అవకాశం ఇచ్చేవారని అనేక
ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయానికి విరామమెందుకని ? స్థానిక ప్రతిభను విస్మరించడం సరికాదని నృత్య కళాకారుల తరఫున స్థానిక మున్సిపల్ 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఇల్లందు పట్టణంలో ఆనవాయితీగా దశాబ్దాలుగా దసరా ఉత్సవాల్లో భాగంగా స్థానిక నృత్య కళాకారులు ప్రదర్శనలు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తున్నప్పటికీ, ఈసారి వారికి అవకాశం కల్పించకపోవడంపై 13వ వార్డు కౌన్సిలర్ దండు సారయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా నృత్య కళను నమ్ముకొని సాధన చేస్తూ, తమ ప్రతిభతో ప్రజలను అలరిస్తున్న స్థానిక కళాకారులకు దసరా ఉత్సవాల్లో అవకాశం కల్పించకపోవడం విచారకరమన్నారు. అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని ఈసారి ఎందుకు పక్కనపెట్టారో సంబంధిత అధికారులు, ఉత్సవ నిర్వాహకులు సమాధానం చెప్పాలని దండు సారయ్య ప్రశ్నించారు.
స్థానిక కళాకారులంటే ఎందుకింత నిర్లక్ష్యమో తెలుపాలన్నారు. ఈ పద్ధతి సరికాదన్నారు.
దసరా వంటి ప్రధాన పండుగల్లో స్థానిక కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందని దండు సారయ్య పేర్కొన్నారు. కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం కోరుతున్నారని, వారికి వేదిక కల్పించడం ఎవరో చేసే ఉపకారం కాదని అది ప్రజా ప్రతినిధుల బాధ్యత అని స్పష్టం చేశారు. స్థానికంగా ప్రతిభావంతులైన కళాకారులు ఉన్నప్పటికీ వారికి అవకాశం కల్పించకపోవడం వారి కళా నైపుణ్యాన్ని గుర్తించనట్లేనని అన్నారు. పండుగ వేడుకల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యత ఇవ్వకపోతే వారిని ప్రోత్సహించేదెవరని ? వారి ప్రతిభకు గుర్తింపు లభించేదెలా? అని ప్రశ్నించారు.
అధికారులు ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలన్నారు.
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, మున్సిపల్ కమిషనర్ సందీప్ ఈ విషయంపై తక్షణమే స్పందించి స్థానిక కళాకారులను చిన్న బుచ్చవద్దని, వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని దండు సారయ్య కోరారు. దసరా ఉత్సవాల్లో స్థానిక నృత్య కళాకారులకు ప్రదర్శనలు ఇచ్చే అవకాశం కల్పించేలా సంబంధిత అధికారులు, నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని యథావిధిగా కొనసాగిస్తూ స్థానిక కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు.
స్థానిక కళాకారులను విస్మరించి ఉత్సవాలు నిర్వహించడం సరికాదని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ దసరా వేడుకల్లో భాగస్వాములను చేయాలని దండు సారయ్య స్పష్టం చేశారు. ఇప్పటికైనా అధికారులు సానుకూలంగా స్పందించి స్థానిక నృత్య కళాకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.