నేడే ఇల్లందులపాడు కాళీమాత కాలనీలో ఈ నెల 18న ఘనంగా బతుకమ్మ పోటీలు
ముఖ్యమైన పాయింట్స్:విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని, రెండో వార్డు ఇల్లందులపాడు కాళీమాత ఆలయం ఎదుట, ఈ నెల 18వ తేదీన ఆదివారం బతుకమ్మ పండుగ సందర్భంగా ఘనంగా బతుకమ్మ పోటీలు, సంబరాలు నిర్వహించనున్నారు.
స్థానిక యువత, పెద్దల ఆధ్వర్యంలో, ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇల్లందు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ కోరం కనకయ్య సహకారంతో, ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్ నాయకత్వంలో ఈ వేడుకలు నిర్వహించనున్నారు.
బతుకమ్మ పోటీల్లో విజేతలకు ప్రత్యేక బహుమతులు ఉన్నాయన్నారు.
పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నారు.
మొదటి బహుమతి: డ్రెస్సింగ్ టేబుల్
-----------------------
రెండో బహుమతి: మిక్సర్ గ్రైండర్
-----------------------
మూడో బహుమతి: పట్టు చీర
-----------------------
బహుమతులుగా స్థానికులు అందించే ఆర్థిక సహాయంతో, కొనుగోలు చేసి, ఎమ్మెల్యే,మున్సిపల్ చైర్ పర్సన్ చేతుల మీదుగా విజేతలకు అందజేయనున్నారని
1వ, 2వ వార్డుల మహిళలకు మాత్రమే ఈ ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉందని కాళీమాత కాలనీ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
ఈ నెల 18న నిర్వహించే బతుకమ్మ పోటీల్లో, ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు, 2వ వార్డులకు చెందిన మహిళలు మాత్రమే పాల్గొనాలని,
ఈ రెండు వార్డుల మహిళల్లో పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మాత్రమే బహుమతులు అందజేయబడతాయని,
విజేతల ఎంపికకు ప్రత్యేక కమిటీ
బహుమతుల విజేతలను ఎంపిక చేసేందుకు మరోక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారని,
ఈ కమిటీలో మున్సిపల్ చైర్పర్సన్, ఇతర పెద్దలు, ప్రభుత్వ అధికారుల సతీమణులు సభ్యులుగా వ్యవహరిస్తారని,
1వ, 2వ వార్డులకు చెందిన సాధారణ వ్యక్తులకు ఈ ఎంపిక కమిటీలో స్థానం ఉండదని, విజేతల ఎంపికను ప్రత్యేక కమిటీ ద్వారా నిర్వహించనున్నారని,
మహిళలు పెద్ద సంఖ్యలో, ఉత్సాహంగా పాల్గొని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని నిర్వాహకులు కోరారు.
మహిళల ఐక్యతను చాటుతూ, ఈ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.